ఆలయాభివృద్డి పేరుతో కేసీఆర్ భక్తులను మోసం చేస్తుండు

V6 Velugu Posted on Jan 24, 2022

ఆలయాల అభివృద్ది పేరుతో సీఎం కేసీఆర్..ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ..నాస్తికుల రాజ్యంగా మారిందన్నారు. ఇవాళ వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు  బండి సంజయ్. ఆయనకు  ఆలయాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆ తర్వాత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్త అన్న కేసీఆర్.. ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఆరోపించారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీ.. కానీ భక్తుల సౌకర్యాల పై ప్రభుత్వం  సమీక్ష చేయక పోవడం బాధాకరమన్నారు.  కేసీఆర్ రాజన్న కి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. క్యూలైన్ లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యంగులు ఇబ్బంది పడుతున్నారు... ఆలయంలో శానిటేషన్ చేయడంలోనూ విఫలం అని అన్నారు. తెలంగాణ వచ్చాక ఇంచార్జి ఈఓ లే ఉన్నారు..ప్లాన్ ప్రకారం ఇంచార్జి ఈఓ లను మరుస్తున్నారని ఆరోపించారు. రాజన్న ఆలయం పట్ల, పేద భక్తుల పట్ల  ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఆనాడు సమైక్యాంధ్ర కాబట్టి వివక్ష అయింది అన్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర మే కదా.. సీఎం గా ఉన్నావ్ ఎందుకు అభివృద్ధి చేయడం లేదు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి పాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరుపున రాజన్న ఆలయం ను మేము డెవలప్ చేస్తాం అని అన్నారు. రాజన్న దేవుడికి సీఎం కేసీఆర్ శఠగోపం పెడుతావా...దేవుడికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే..నీసంగతి దేవుడే తేలుస్తాడు అని హెచ్చరించారు. దేవాలయ అభివృద్ధి పై రంగు రంగుల బ్రోచర్లు చూపిస్తూ  ఇంకెతకాలం  భక్తులను మోసం చేస్తావంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. 

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రండి

 

Tagged Bandi Sanjay, Devotees, KCR, cheating, Temple Development

Latest Videos

Subscribe Now

More News