కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు విషెస్ చెప్పిన బండి సంజయ్

కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు విషెస్ చెప్పిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డికి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ విషెస్ చెప్పారు. అలాగే ఎన్నికల కమిటీ నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశించారు.  తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి  కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  రాజీనామా చేసిన  బండి సంజయ్..  పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును స్టేట్ బీజేపీ ఆఫీసుకు పంపించారు. అంతేకాకుండా తన ఛాంబర్ ను కూడా  హ్యాండోవర్ చేశారు.  గతేడాది 2022లో టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని సంజయ్ కు కైటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాహానం కోసం పార్టీ తరుపున రెండుకోట్లు కేటాయించింది. తన అధ్యక్ష పదవి ముగియడంతో బండి సంజయ్ తిరిగి దానిని పార్టీకి అప్పగించారు.