కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి  సంజయ్

కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు అంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. కేసీఆర్ పాలనలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు ఎలాగైతే బౌన్స్ అయ్యాయో అలాగే ఆలయాలకు ఇస్తానన్న నిధులు కూడా నీటిమూటలయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో మోడీ రాజ్యం వచ్చిన తర్వాత ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలన రజాకర్లను గుర్తు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ది నోరు కాదు తాటి మట్ట అని విమర్శించారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్కు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయని బండి సంజయ్ అన్నారు. మూర్ఖునికి అధికారమిస్తే రాష్ట్రం ఇంకేమి అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టాండ్ దగ్గర బండి సంజయ్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు.