ప్రశాంతంగా ఎంప్లాయీస్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు

ప్రశాంతంగా ఎంప్లాయీస్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు

రామచంద్రాపురం, వెలుగు: బండ్లగూడ ఇండస్ట్రియల్​ ఎంప్లాయీస్​ కో ఆపరేటీవ్​ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. కలెక్టర్​ ఆదేశాల మేరకు భారతీనగర్ డివిజన్​ పరిధిలోని ఎల్​ఐజీ కమ్యూనిటీ హాల్​లో అధికారులు ఈ ఎన్నికలు నిర్వహించారు. అమీన్​పూర్, పటాన్​చెరు, తెల్లాపూర్, కొల్లూర్​లోని నారాయణ రావు లే ఔట్​కు సంబంధించిన హౌసింగ్ ప్యానెల్​కు ఈ ఎన్నికలు జరిగాయి. కొన్నేళ్లుగా సొసైటీ యాక్టీవ్​గా లేకపోవడంతో వేలాది మంది ప్లాట్ ఓనర్లు డైలమాలో ఉన్నారు.

 ప్రభుత్వ ఆదేశాలతో సొసైటీ ఎన్నికలు నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకోవాలని నిర్ణయించి మొత్తం 9 మంది డైరెక్టర్ పదవులకు సోమవారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 1785 ఓట్లు ఉండగా 971 ఓట్లు పోలయ్యాయి. 9 డైరెక్టర్ల పోస్టులకు ఓపెన్​ కేటగిరీలో 18 మంది, మహిళా కేటాగిరిలో 9 మంది పోటీ పడగా ఎస్సీ, ఎస్టీ నుంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారని జిల్లా కో ఆపరేటివ్​ అధికారులు కిరణ్​ కుమార్​, విరాజిత్ అలీ పేర్కొన్నారు.