రివ్యూ:  బంగార్రాజు

రివ్యూ:  బంగార్రాజు

రివ్యూ:  బంగార్రాజు
నటీనటులు :  నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజి, రావు రమేష్, సంపత్ తదితరులు
కెమెరా: యువరాజ్
ఎడిటింగ్: విజయ్ వర్ధన్
సంగీతం: అనూప్ రూబెన్స్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ,మాటలు,దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
విడుదల తేదీ: 14 జనవరి 2022

సోగ్గాడే చిన్ని నాయన కమర్షియల్ హిట్.సోషియో ఫాంటసీ ఫార్మూలాను నాగార్జున ఇమేజ్ కు తగ్గట్టు రొమాంటిక్ హిట్ కొట్టారు. దానికి సీక్వెల్ గా తీసిన సినిమానే ‘‘బంగర్రాజు’’. సోగ్గాడేలో జూనియర్ నాగార్జునకి కొడుకు పుడతాడు. భార్య చనిపోవడంతో తన తల్లి (రమ్యకృష్ణ)కు అప్పగించి విదేశాలకు వెళ్లిపోతాడు. పెద్దయ్యాక అన్ని తాత బుద్దులే వస్తాయి. తనకు ఓ ఆపద వస్తుంది. అతన్ని కాపాడటానికి మళ్లీ బంగర్రాజు కిందకి వస్తాడు. ఆ ప్రాబ్లమ్ నుంచి మనమడిని ఎలా బయటపడేసాడనేది తెర మీద చూసి తెలుసుకోవాలి.

సోగ్గాడే సినిమాకు తగ్గట్టు కథ అయితే బాగా కుదిరింది కానీ మందకొడి స్క్రీన్ ప్లే కారణంగా కాస్త బోర్ కొడుతుంది.కొన్ని లాజిక్ కు దూరంగా ఉండే సీన్లు చిరాకు తెప్పిస్తాయి. సోషియో ఫాంటసీ కథ అడ్డంగా పెట్టుకున్న డైరెక్టర్ తనకు ఇష్టం వచ్చినట్టు తీసేసాడు.అయితే నాగార్జున ఆహార్యం,నాగచైతన్య చార్మ్ ముందు కొన్ని సీన్లు పాస్ అయ్యేలా ఉన్నాయి.

నటన విషయానికొస్తే నాగార్జున బంగర్రాజు పాత్రలో మరోసారి మెప్పించాడు.ఆయన చరిష్మాతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. అలాగే నాగచైతన్య జూనియర్ బంగర్రాజు రోల్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. ఈ మూవీలో తను చాలా అందంగా కనిపించాడు. రమ్యకృష్ణ ఎప్పటిలాగే రాణించింది. కృతిశెట్టి అందం, అభినయంతో ఆకట్టుకుంది. రావు రమేష్, సంపత్ , గోవింద్ పద్మసూర్య, వెన్నెల కిషోర్ తదితరులు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

టెక్నికల్ గా సినిమా యావరేజ్ గా ఉంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ తన మ్యూజిక్ తో నిరాశపరిచాడు. సాంగ్స్ లో ఒకట్రెండు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉంది. ఆర్ట్ వర్క్ ఓకే. గ్రాఫిక్స్ వర్క్ లో-స్టాండర్డ్స్ లో ఉంది. డైలాగులు ఫర్వాలేదు. ఓవరాల్ గా బంగర్రాజు యావరేజ్ గా ఉంది. రొటీన్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు బోర్ కొట్టిస్తాడు. కాకపోతే ఈ పండగ సీజన్ లో ఓ కమర్షియల్ సినిమాగా ప్రేక్షకులకి ఓ ఆప్షన్ గా ఉపయోగపడుతుంది. చివరి 15 నిమిషాలు బాగుంది. నాగార్జున, నాగచైతన్య నటన, సోషియో ఫాంటసీ కథ, రొమాన్స్.. వీటి కోసం ఓ సారి ట్రై చేయవచ్చు.