తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు  బంగ్లాదేశ్ ఆలౌట్

ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 254 పరుగుల లీడ్ లభించింది. ఓవర్ నైట్ స్కోరు 133/8తో మూడో రోజు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ను కుల్దీప్ యాదవ్ దెబ్బ కొట్టాడు. ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (17‌)  ఔట్ చేశాడు. దీంతో బంగ్లా 144 పరుగులకే 9 వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఖలీద్ అహ్మద్ డకౌట్గా వెనుదిరగడంతో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది.  భారత బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 3 వికెట్లు  దక్కించుకున్నాడు. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేలో చెరో  వికెట్ తీశారు. 

అంతకుముందు  ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 133.5 ఓవర్లలో 404 రన్స్‌‌కు ఆలౌటైంది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (86) ఔటైనా, అశ్విన్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీతో సత్తా చాటాడు. 22 నెలల తర్వాత టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఆడుతున్న స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌..అశ్విన్‌‌తో కలిసి ఎనిమిదో వికెట్‌‌కు 92 రన్స్‌‌ జోడించాడు. తైజుల్‌‌ ఇస్లామ్‌‌, మెహిదీ హసన్‌‌ చెరో నాలుగు వికెట్లు తీశారు.