నేడు బంగ్లాదేశ్ తో ఇండియా తొలి వన్డే

నేడు బంగ్లాదేశ్ తో ఇండియా తొలి వన్డే
  • గాయంతో షమీ దూరం
  • ఉ.11. 30 నుంచి సోనీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో

మీర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌: ఓవైపు నిలకడగా ఆడుతున్న శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌.. మరోవైపు వైస్​ కెప్టెన్​ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌.. ఈ ఇద్దరిలో ఎవర్ని ఓపెనర్‌‌‌‌గా పంపించాలి? వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ ఎలా ఉండాలి? అన్న అంశాలపై దృష్టి సారించిన ఇండియా టీమ్‌‌‌‌.. బంగ్లాదేశ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఆదివారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇచ్చినా.. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో ఫుల్‌‌‌‌ లైనప్‌‌‌‌ అందుబాటులో ఉండటంతో ఎవర్ని తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

షమీ ప్లేస్‌‌‌‌లో ఉమ్రాన్‌‌‌‌.. బంగ్లా కెప్టెన్​గా లిటన్​

కుడి భుజం గాయంతో షమీ ఈ సిరీస్‌‌‌‌కు దూరం కావడంతో అతని ప్లేస్‌‌‌‌లో ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ను తీసుకున్నారు. దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ పేసర్లుగా బరిలోకి దిగొచ్చు. మరోవైపు ఈ సిరీస్‌‌‌‌ కోసం బంగ్లాదేశ్‌‌‌‌.. లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. తమీమ్‌‌‌‌ లేకపోవడంతో షకీబ్‌‌‌‌ను మూడో ప్లేస్‌‌‌‌కు ప్రమోట్‌‌‌‌ చేయనున్నారు.