టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన  తమీమ్ ఇక్బాల్

బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  అంతర్జాతీయ  టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్  ఈ నిర్ణయం తీసుకున్నాడు.  తమీమ్  కెప్టెన్సీలో  విండీస్‌తో  జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్‌  30 తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.  2007 నుండి 2018 వరకు బంగ్లాదేశ్   టీ20 జట్టులో తమీమ్ రెగ్యులర్ ఆటగాడు .. చివరిసారిగా తమీమ్  మార్చి 2020లో జింబాబ్వేపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో 33 బంతుల్లో 41 పరుగులు చేసాడు.  మొత్తం 78 మ్యాచ్‌ లకు తమీమ్ ప్రాతినిథ్యం వహించగా 24.08 సగటుతో 1,758 పరుగులు సాధించాడు.  తమీమ్ తన టీ20 కెరీర్‌లో 7 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ తరపున  టీ20లో  సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు అతడే కావడం విశేషం కాగా టీ20లో బంగ్లాదేశ్ తరపున  అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా తమీమ్ నిలిచాడు.