G2 Banita Sandhu: గూఢచారితో యాక్షన్కి సిద్ధమైన హాట్ బ్యూటీ బనితా సంధు!

G2 Banita Sandhu: గూఢచారితో యాక్షన్కి సిద్ధమైన హాట్ బ్యూటీ బనితా సంధు!

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘జీ 2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్..శేష్‌‌కు జంటగా బనితా సంధు(Banita Sandhu) నటిస్తోందని కన్ఫమ్ చేశారు. అయితే,ఇప్పుడు తను ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుందా..లేదా అనే సందేహాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మొదలయ్యాయి.ఇందుకు కారణం లేకపోలేదు.

రీసెంట్గా ఈ ప్రాజెక్ట్లో ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్గా షూటింగ్లో జాయిన్ అయినట్లు సమాచారం కూడా ఇచ్చారు మేకర్స్. కానీ,ఇంత‌వ‌ర‌కూ ఈ భామ సెట్స్కి వెళ్ల‌క‌పోవ‌డంతో జీ2లో ఆమె ఉందా? లేదా? అన్న టాపిక్ పెద్ద ఎత్తున నడుస్తుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..జీ 2 నెక్స్ట్ షెడ్యూల్ గుజ‌రాత్ లోని భుజ్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో బ‌నితా  జాయిన్ అవుతుంద‌ని యూనిట్ సభ్యుల నుంచి స‌మాచారం. ఈ షెడ్యూల్ లో శేష్ పై పలు కీల‌కమైన యాక్ష‌న్ సీన్స్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్పెషల్ యాక్షన్ షెడ్యూల్ లో బనిత కూడా ఉంటుందట.  

‘జీ2’లో నటించడంపై ఇదివరకే ఆమె మాట్లాడుతూ..‘ఇదే నా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇలాంటి విజనరీ టీమ్‌‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. గతంలో నేనెప్పుడూ కనిపించని డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌ను ఇందులో పోషిస్తున్నా. ప్రేక్షకులు నన్ను ఓ సరికొత్త అవతార్‌‌‌‌లో చూడబోతున్నారు’ అని చెప్పింది.  

అక్టోబర్, సర్దార్‌‌ ఉదమ్‌‌ వంటి హిందీ చిత్రాలతో పాటు తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’లో హీరోయిన్‌‌గా నటించింది బనితా.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్స్‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.