ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే...

ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే...

సంవత్సరంలో రెండవ నెల అయిన ఫిబ్రవరి కొద్ది రోజుల్లో  ప్రారంభంకానుంది. 2024 ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాను ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా)  ప్రకటించింది. ఫిబ్రవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి. 

ఈ బ్యాంకు సెలవుల్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినవి, ఇంకొన్ని జాతీయ సెలవు దినాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులను మూడు బ్రాకెట్ల కింద పెడుతుంది. అవి.. నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేస్ కింద సెలవులు, బ్యాంకుల ఖాతాల మూసివేత.

ఫిబ్రవరిలో బ్యాంక్​ సెలవుల వివరాలు..

  • 4 ఫిబ్రవరి: ఆదివారం
    .
  • 10 ఫిబ్రవరి: రెండవ శనివారం / లోసార్లో- గ్యాంగ్టక్​లోని బ్యాంక్​లకు సెలవు
  • 14: వసంత పంచమి / సరస్వతీ పూజ (శ్రీ పంచమి)- అగర్తలా, భువనేశ్వర్, కోల్​కతాలోని బ్యాంకులకు సెలవు.
  • 15 ఫిబ్రవరి: లుయి-ఎన్​గై ని- ఇంఫాల్​లోని బ్యాంకులకు సెలవు.
  • 18 ఫిబ్రవరి: ఆదివారం
  • 19 ఫిబ్రవరి : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి- బేలాపూర్, ముంబై, నాగపూర్ లో బ్యాంకులకు సెలవు.
  • 20 ఫిబ్రవరి: ఐజ్వాల్ లో బ్యాంకులకు సెలవు.
  • 24 ఫిబ్రవరి: రెండో శనివారం
  • ఫిబ్రవరి 25: ఆదివారం
  • ఫిబ్రవరి 26: నైకూమ్- ఇటానగర్ లో బ్యాంకులకు సెలవు

ఈ సేవలు పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.