ఐడీబీఐలో రాత పరీక్ష లేకుండా జాబ్

ఐడీబీఐలో రాత పరీక్ష లేకుండా జాబ్
ఎస్​బీఐ, ఐడీబీఐల్లో.. 586 స్పెషలిస్ట్  ఆఫీసర్స్ ఐడీబీఐ ఆఫీసర్స్​కు నో టెస్ట్​ ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్​మెంట్​కు ఎలాంటి రిటెన్​ టెస్ట్​ లేదు. గ్రూపు డిస్కష‌‌‌‌న్‌‌‌‌, ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూల్లో అభ్యర్థి సాధించిన మెరిట్​ ఆధారంగానే ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. ఖాళీలు: 134( డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్-డి) –11, అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్-సి)–52, మేనేజర్(గ్రేడ్-బి)–62, అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ)–9) అర్హత‌‌‌‌: పోస్టును బట్టి క‌‌‌‌నీసం 60 శాతం మార్కుల‌‌‌‌తో సంబంధిత స‌‌‌‌బ్జెక్టు్ల్లో గ్రాడ్యుయేష‌‌‌‌న్‌‌‌‌, బీఈ/ బీటెక్‌‌‌‌/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్ పాసై ఉండాలి. సంబంధిత ప‌‌‌‌ని నైపుణ్యాలు, అనుభ‌‌‌‌వం ఉండాలి. వయసు: వివిధ పోస్టులను బట్టి కనీస వయసు 21, గరిష్టంగా 45 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, డిపార్ట్‌‌‌‌మెంట‌‌‌‌ల్‌‌‌‌ వారికి ఐదేళ్లు రిలాక్సేషన్​ ఇచ్చారు. సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమిన‌‌‌‌రీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల త‌‌‌‌దుప‌‌‌‌రి సెలెక్షన్​ ఉంటుంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పంపించిన ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తుల్లోని విద్యార్హత‌‌‌‌లు, అనుభ‌‌‌‌వం, ఇత‌‌‌‌ర వివ‌‌‌‌రాల ఆధారంగా అభ్యర్థుల‌‌‌‌ను షార్ట్‌‌‌‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌‌‌‌లిస్ట్ చేసిన వారిని గ్రూప్ డిస్కష‌‌‌‌న్(జీడీ)/ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూకి పిలుస్తారు. ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. దీన్ని 100 మార్కుల‌‌‌‌కు నిర్వహిస్తారు. దీనిలో జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ అభ్యర్థుల‌‌‌‌కు 50, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడ‌‌‌‌బ్ల్యూడీల‌‌‌‌కు 45 క‌‌‌‌నీస అర్హత మార్కులుగా కేటాయించారు. జీడీ/ ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థుల‌‌‌‌కు బ్యాంక్ నిబంధ‌‌‌‌న‌‌‌‌ల ప్రకారం మెడిక‌‌‌‌ల్ టెస్ట్ నిర్వహిస్తారు. ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్ లో.. అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌‌‌‌బ్ల్యూడీ వారికి రూ.150 ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తుకు చివ‌‌‌‌రి తేది: 7 జనవరి 2021 వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.idbibank.in స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ), ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ)ల్లో స్పెషలిస్ట్​ కేడర్/స్పెషలిస్ట్​​ ఆఫీసర్స్​ రిక్రూట్​మెంట్​కు వేర్వేరుగా నోటిఫికేషన్స్​ రిలీజ్​ అయ్యాయి. ఎస్​బీఐలో 452, ఐడీబీఐలో134 మొత్తం 586 ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ ప్రాసెస్​ స్టార్ట్​ అయింది. నోటిఫికేషన్ల వివరాలతోపాటు రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్​ కేడర్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం అప్లికేషన్లు కోరుతోంది. 452 ఖాళీల్లో మేనేజ‌‌‌‌ర్, ఇంజినీర్ ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి.  జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్ ను పరిశీలిస్తారు. మేనేజ‌‌‌‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌‌‌‌ర్స్‌‌‌‌), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు మాత్రం అప్లికేషన్లు షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఓవరాల్​ మెరిట్​ ప్రకారం  ఫైనల్​ రిక్రూట్​మెంట్​ చేపడతారు. ఎగ్జామ్​ ప్యాటర్న్ మేనేజర్ (మార్కెటింగ్), డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) ఉద్యోగాలకు రిటెన్​ టెస్ట్​ ఉంటుంది. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. టైం 120 నిమిషాలు. బ్యాంకింగ్ నాలెడ్జ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ అనాలిసిస్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ విభాగాల్లో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇంగ్లిష్ నాలెడ్జ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్సేలపై ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కుల టెస్ట్​ 30 నిమిషాల టైం ఉంటుంది.  ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలోని ప్రతి సబ్జెక్టులో బ్యాంకు నిర్ణయించే కనీస మార్కులను పొందిన వారి డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.  రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇది 25 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు. అసిస్టెంట్ మేనేజర్(సిస్టమ్స్/సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్/ సెక్యూరిటీ అనలిస్ట్​),  ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ లీడ్ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్ .. రీజనింగ్ (50 మార్కులకు 50 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ( 35 ప్రశ్నలు 35 మార్కులకు), ఇంగ్లిష్ లాంగ్వేజ్​ (35 ప్రశ్నలు 35 మార్కులకు) ల్లో మొత్తం 120 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్​ 75 ప్రశ్నలను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్​ టైం 70 నిమిషాలు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా 150 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మేనేజర్ (నెట్ వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్/నెట్ వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్) ఉద్యోగాల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై 80 ప్రశ్నలను 100 మార్కులకు అడుగుతారు. డ్యురేషన్​ 120 నిమిషాలు. 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. డిప్యూటీ మేనేజర్(ఇంటర్నల్ ఆడిట్) ఉద్యోగాలకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (50 మార్కులకు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులకు), ఇంగ్లిష్ (35 మార్కులకు) విభాగాల నుంచి మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. టైం 90 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు100 మార్కులకు ఇస్తారు. 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మేనేజ‌‌‌‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌‌‌‌ర్స్‌‌‌‌), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు అప్లికేషన్స్​ ప్రాసెస్​ తర్వాత షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు 100 మార్కులకు ఇంటర్య్వూలు కండక్ట్​ చేస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా సెలెక్షన్​ చేపడతారు. కేటగిరీల వారీగా ఖాళీలు మేనేజ‌‌‌‌ర్(మార్కెటింగ్‌‌‌‌)-–12, డిప్యూటీ మేనేజ‌‌‌‌ర్(మార్కెటింగ్‌‌‌‌)-–26, మేనేజ‌‌‌‌ర్(క్రెడిట్ ప్రొసీజ‌‌‌‌ర్స్‌‌‌‌)–2, అసిస్టెంట్ మేనేజ‌‌‌‌ర్(సిస్టం)–183,  డిప్యూటీ మేనేజ‌‌‌‌ర్(సిస్టం)–17, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌‌‌‌ప‌‌‌‌ర్ట్‌‌‌‌–-15, ప్రాజెక్ట్ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌–-14, అప్లికేష‌‌‌‌న్ ఆర్కిటెక్ట్–5, టెక్నిక‌‌‌‌ల్ లీడ్‌‌‌‌-–2, అసిస్టెంట్ మేనేజ‌‌‌‌ర్(సెక్యూరిటీ అన‌‌‌‌లిస్ట్)-–40, డిప్యూటీ మేనేజ‌‌‌‌ర్(సెక్యూరిటీ అన‌‌‌‌లిస్ట్‌‌‌‌)-–60, మేనేజ‌‌‌‌ర్(నెట్‌‌‌‌వ‌‌‌‌ర్క్ సెక్యూరిటీ స్పెష‌‌‌‌లిస్ట్‌‌‌‌)–12, మేనేజ‌‌‌‌ర్(నెట్‌‌‌‌వ‌‌‌‌ర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెష‌‌‌‌లిస్ట్‌‌‌‌)–20, డిప్యూటీ మేనేజ‌‌‌‌ర్(ఇంట‌‌‌‌ర్నల్ఆడిట్‌‌‌‌)-–28, ఇంజినీర్(ఫైర్‌‌‌‌)–-16. మొత్తం పోస్టులు 452 అర్హతలు: విభాగాల వారీగా పోస్టును బట్టి అర్హతలు ఉన్నాయి. దరఖాస్తులు: ఆన్​లైన్​లో.. చివరి తేదీ: 11 జనవరి, 2021 ఆన్ లైన్ రాత పరీక్షలు: 2021 ఫిబ్రవరి 1, 7 తేదీల్లో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.sbi.co.in For More News.. టెస్టుల్లోకి హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ అరంగేట్రం‌‌ కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి మన రియాల్టీ విరాట్‌‌ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు