
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కు మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో నికర లాభం (కన్సాలిడేటెడ్) 5.59 శాతం పెరిగి రూ. 5,415 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) తగ్గడం వల్ల లాభం తగ్గింది. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం 3.3 శాతం పెరిగి రూ. 5,048 కోట్లు ఉంది.
మొత్తం 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 10 శాతం పెరిగి రూ. 17,789 కోట్లకు చేరుకుంది. రుణ వృద్ధి 12 శాతానికి పైగా ఉన్నప్పటికీ, నికర వడ్డీ ఆదాయం 6.6 శాతం తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఎన్ఐఎం 0.25 శాతం తగ్గడమేనని బీఓబీ పేర్కొంది.