మరిన్ని చిన్న బ్యాంకులు NBFC లో కలుస్తాయ్

మరిన్ని చిన్న బ్యాంకులు NBFC లో కలుస్తాయ్

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ గ్రూపు గత ఏడాది దివాలా తీసిన తరువాత చాలా నాన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌ కంపెనీలు లిక్విడిటీ ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.కంపెనీల ఫండింగ్‌ వ్యయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అందుకే ఇప్పుడు ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలన్నీ లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌–ఇండియా బుల్స్‌‌‌‌ విలీనాన్నిఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇండి యాబుల్స్‌‌‌‌ లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఏర్పాటుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే, చిన్న బ్యాంకులతో ఒప్పందాలకు చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని క్రెడిట్‌ సూసీ గ్రూప్‌‌‌‌ ఏజీ ఎనలిస్టులు తెలిపారు. ఒకవేళ ఆర్‌బీఐ గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌ ఇస్తే ఒక ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలో బ్యాంకు విలీనం కావడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఇలాంటి విలీనాలకు అనుమతి ఇస్తూ ఆర్‌బీఐ 2016లోనే రూల్స్‌‌‌‌ను సరళీకరించింది. ఇండి యాబుల్స్‌‌‌‌ లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ తదనంతరం కొత్త విలీనాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, చిన్న బ్యాంకులను పెద్ద ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు లక్ష్యం చేసుకుంటాయని క్రెడిట్‌ సూసీ ఎనలిస్ట్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ గుప్తా చెప్పారు. రెండు సంస్థల విలీనం వార్తలు రావడంతో సోమవారం లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌తోపాటు ఇతర చిన్న బ్యాంకు షేర్లు పెరిగాయి. సౌత్‌ ఇండియా బ్యాంక్‌‌‌‌ ఆరు శాతం, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌‌‌‌ 4.8 శాతం పెరిగాయి.

చిన్న బ్యాంకులే టార్గెట్‌
ఐఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ దివాలా అనంతరం ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలకు మార్కెట్లో నగదు దొరకడం కష్ట సాధ్యంగా మారింది. వ్యాపారాలను సమర్థంగా తీర్చిదిద్దడానికి, లిక్కిడిటీ ఇబ్బందుల బారి నుంచి బయటపడటానికి చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవడం మేలని ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు భావిస్తున్నాయి. విలీనంవల్ల మరో లాభం ఏమిటంటే విలీనం అయిన ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ కూడా బ్యాంకు అవుతుంది. మనదేశంలోని కొన్ని చిన్న బ్యాంకులు లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ వాల్యుయేషన్‌‌‌‌తో పోలిస్తే తక్కువ ధరకు ట్రేడ్‌‌‌‌ అవుతున్నాయి. కర్ణాటక బ్యాంక్‌‌‌‌ ప్రైస్‌‌‌‌ టుబుక్‌‌‌‌ నిష్పత్తి 0.71 ఉంది. ఇప్పట్లో లిక్విడి టీ పెరిగే అవకాశం లేదు కాబట్టి ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు చిన్న బ్యాంకువైపు చూస్తాయని టార్గెట్‌ ఇన్వెస్లింగ్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ కల్రా అన్నా రు. డీసీబీ బ్యాంక్‌‌‌‌, కర్ణాటక బ్యాంకులు విలీనం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. ఇండియా బుల్స్‌‌‌‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌‌‌‌ (ఐబీహెచ్‌ ఎఫ్‌‌‌‌)లో విలీనం అవుతున్నట్లు లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (ఎల్‌‌‌‌వీబీ) ఈ నెల ఐదున ప్రకటించింది. విలీనానికి అనుమతి వస్తే దేశీయంగా 8వ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌‌‌‌ ఏర్పాటు అవుతుంది. విలీన సంస్థ పేరును ‘ఇండి యాబుల్స్‌‌‌‌ లక్ష్మీవిలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌’ అని పిలుస్తారు. దేశీయంగా తనఖా రుణాలిచ్చే సంస్థల్లో రెండో అతిపెద్ద సంస్థ ఐబీహెచ్‌ఎఫ్‌‌‌‌. ఈ సంస్థ ప్రమోటర్లకు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఉన్నాయి. 2015లో బ్యాంకింగ్‌ లైసెన్సు పొందడంలోనూ ఈ సంస్థ విఫలమైంది.ఈ నేపథ్యం లో, ఈ సంస్థల విలీనానికి బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ రిజర్వ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా(ఆర్‌ బీఐ) అనుమతిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే ఆర్‌బీఐ కొన్ని సంస్థలకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.