జూలై నెలలో బ్యాంకు సెలవులు ఇవే

జూలై నెలలో బ్యాంకు సెలవులు ఇవే

మరో నాలుగు రోజుల్లో జూన్ నెల ముగియబోతోంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) జూలై 2023 నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. శని, ఆదివారాలు, పండుగలు కలుపుకుంటే జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. జూలై 2న ఆదివారం కాగా, మొదటి అధికారిక సెలవు జూలై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజుతో ప్రారంభమవుతుంది. జూలై 29న మొహర్రం వరకూ తదుపరి సెలవులు కొనసాగనున్నాయి. 

ALSO READ:దిగొచ్చిన ఐటీ ఉద్యోగులు : జీతాలు తగ్గినా పర్వాలేదు.. ఉద్యోగం ఉంటే చాలు

జూలై 2023 నెల బ్యాంకుల సెలవుల జాబితా

జూలై 2, 2023: ఆదివారం
జూలై 5, 2023: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు).
జూలై 6, 2023: మిజోరాం మహిళల ఇన్సుయ్‌ఖౌమ్ పాల్ దినోత్సవం(మిజోరంలో బ్యాంకులు మూత).
జూలై 8, 2023: రెండవ శనివారం
జూలై 9, 2023: ఆదివారం
జూలై 11, 2023: కేర్ పూజ (త్రిపురలో బ్యాంకులకు సెలవు)
జూలై 13, 2023: భాను జయంతి (సిక్కింలో బ్యాంకులు మూత)
జూలై 16, 2023: ఆదివారం
జూలై 17, 2023: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయలో బ్యాంకులు మూత)
జూలై 21, 2023: ద్రుక్పా త్షే-జి (సిక్కింలో బ్యాంకులకు సెలవు).
జూలై 22, 2023: నాల్గవ శనివారం
జూలై 23, 2023: ఆదివారం
జూలై 28, 2023: అషూరా (జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు మూత).
జూలై 29, 2023: ముహర్రం (తజియా)
జూలై 30, 2023: ఆదివారం

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే అనే మూడు కేటగిరీల కింద ఆర్ బీఐ ప్రతి ఏడాది బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది.

గమనిక: బ్యాంకుల సెలవుల వివరాలు ఆయా రాష్ట్రాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. గమనించగలరు.