బాన్సువాడ, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీలో బాన్సువాడ జట్టు విజేతగా నిలించింది. ఆగ్రోస్ చైర్మన్ బాలరాజ్ మహిళా జట్టుకు కప్పును అందజేశారు. పురుషుల విభాగంలో బాన్సువాడ వర్సెస్తాడ్వాయి మధ్య పోటీ సాగగా బాన్సువాడ విజయం సాధించింది.
మహిళల విభాగంలో బాన్సువాడ వర్సెస్మగ్గిడి మధ్య పోటీ సాగగా బాన్సువాడ జట్టు విజేతగా నిలిచింది. పొచారం శ్రీనివాస్ రెడ్డి విజేతలను అభినందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగా గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
