రాష్ట్ర ప్రభుత్వంపై బార్, రెస్టారెంట్ యజమానుల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వంపై బార్, రెస్టారెంట్ యజమానుల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు గొంతెత్తారు. వైన్స్ లకు ఇచ్చిన పర్మిట్ రూమ్ లు రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమ బార్లు, రెస్టారెంట్స్ నష్టాల్లో నడుస్తున్నాయని వాటి యజమానులు ఆరోపించారు. వైన్స్ ల పర్మిట్ రూములు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం నడవటం లేదని ఆరోపించారు. వైన్స్ ల పర్మిట్ రూమ్ లు నిబంధనల ప్రకారం 20 చదరపు గజాల కంటే తక్కువ, 100 చదరపు గజాల కంటే ఎక్కువ ఉండొద్దని, పర్మిట్ రూముల్లో టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయకూడదని, ఎలాంటి పుడ్ అమ్మొద్దని, మద్యాన్ని విడిగా పెగ్గుల లెక్కన అమ్మడాన్ని అనుమతించ వద్దనే రూల్స్ ఉన్నాయి. కానీ, రూల్స్ కు విరుద్ధంగా వైన్స్ లు నడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ ల పర్మిట్ రూమ్ లు రూల్స్ అతిక్రమించడంతోనే బార్లకు కష్టమర్లు రావటం లేదని, దీంతో బార్ అండ్ రెస్టారెంట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయంటున్నారు. 

వైన్స్ లకు ప్రాధాన్యత ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్స్ ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీహెచ్ఎంసీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్  ఆరోపిస్తోంది. వైన్స్ ల పర్మిట్ రూమ్ ల నిర్వహణ తీరుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. వైన్స్ లో పర్మిట్ రూమ్ లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగడంతో పాటు పబ్లిక్ కు కూడా న్యూసెన్స్ లా మారాయని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వైన్స్ లకు ఇచ్చిన పర్మిట్ రూమ్ లు నిబంధనలకు విరుద్ధంగా నడవకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

 

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె