
ఉద్యోగ నోటిఫికేషన్ లేక బర్రెలు కాస్తున్నా ఫ్రెండ్స్ అంటూ ఒక్క వీడియో చేసి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు బర్రెలక్క(శిరీష). అంతేకాదు.. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీచేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక పోలింగ్ అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బర్రెలక్క గెలుస్తుందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శిరీషను మీకు లవర్ ఉన్నాడా? అని అడిగారు. దానికి సమాధానంగా శిరీష మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నా బావ, ఆయనే నా లవర్, నా క్రష్ కూడా. పోలీసు డ్రెస్సులో మహేష్ బాబు గారిని చూడటం అనే నాకు చాలా ఇష్టం. నేను పోలీసు అవ్వాలని అనుకున్నది కూడా మహేష్ బాబు పోలీసుగా చేసిన సినిమాలు చూసే. సాయికుమార్ గారు సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్.
ఇక బయట మాత్రం ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి.. అలాంటి వాటి జోలికి పొదలుచుకోలేదు. ఇక నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పెద్దగా చదువు, ఆస్తిపాస్తులు లేకపోయినా పరవాలేదు కానీ.. నన్ను మా అమ్మను వాళ్ల అమ్మను బాగా చూసుకుంటే చాలు. అలాంటి వ్యక్తి అయితే చేసుకుంటాను.. అంటూ చెప్పుకొచ్చారు శిరీష. ప్రస్తుతం శిరీష చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.