సీఎం కృషితోనే బాసర ఆలయ పునర్నిర్మాణం : ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

సీఎం కృషితోనే బాసర ఆలయ పునర్నిర్మాణం : ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కుంటాల, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర రూపురేఖలు మార్చి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని విట్టపూర్ లో కొత్త గ్రామ దేవతల ఆలయాలను ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు బాసర అలయాభివృద్ధి గురించి ప్రస్తావించానని, సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించానని తెలిపారు. రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బి.నారాయణ రావు పటేల్, విఠల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, సర్పంచ్ లింగు రాంపటేల్, నాయకులు పాల్గొన్నారు.