బాసర , వెలుగు; ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆదివారం కిటకిటలాండి. కార్తీక మాసం ఆదివారం ఏకాదశి కావడంతో భక్తులు తరలివచ్చారు. గోదావరి నది తీరం వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర పలు ప్రాంతాల నుండి భక్తు లు వేలాదిగా తరలివచ్చారు. శివాలయంలో ఆదిశంకరాచార్యుడికి ప్రత్యేక అభిషేక అర్చన నిర్వహించారు.
నది తీరాన శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయ పూజారులు ప్రవీణ్ ప్రధాన అర్చకులు సంజు కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు ఆది శంకరుడికి రుద్రాభిషేకం అష్టోత్తర శతనామావళి అర్చన హారతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈఓ అంజని దేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
