బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో కార్తీక మాసం మొదటి ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, అమ్మవారికి పూజలు చేశారు.
అక్షరాభ్యాసం, కుంకుమార్చన ప్రదేశాలు, సర్వదర్శన క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. వారికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఒక్కరోజే సుమారు రూ.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో సుదర్శన్ గౌడ్ తెలిపారు.
