బాసర అమ్మవారికి పుట్టింటి పట్టుచీర

బాసర అమ్మవారికి పుట్టింటి పట్టుచీర

బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం రైతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి పట్టు చీరలు సమర్పించారు. ఖరీఫ్‎లో రైతులు పంట సాగు చేసే సమయంలో ప్రతి ఏటా ఆనవాయితీగా చేపట్టే బండారను నిర్వహించారు. ఆలయంలో అమ్మవార్లకు వీడీసీ తరఫున స్థానికులు సంప్రదాయంగా ఉదయం అభిషేక పూజలో సరస్వతి, మహాకాళి, లక్ష్మి అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీరను, వేదవ్యాస మహర్షికి పట్టు పంచలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. 

అనంతరం గ్రామస్తులు మధ్యాహ్నం హారతి తర్వాత ముగ్గురమ్మలతో పాటు వేదవ్యాస మహర్షికి మహానైవేద్యం అందించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదానం  నిర్వహించారు. కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.