బాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం

బాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం

బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్  తెలిపారు. శనివారం టెడ్ఎక్స్ లోగోను ఆర్జేయూకేటీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 190 పైగా దేశాల్లో స్వతంత్రంగా నిర్వహించే టెడ్ఎక్స్ ఈవెంట్ల జాబితాలో చేరడం, టెడ్ఎక్స్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా పొందడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ విద్యార్థుల గొంతుకను గ్లోబల్  ఫోరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినిపించేందుకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. టెడ్ఎక్స్ ఆర్జీయూకేటీ పేరుతో తొలి ఈవెంట్ ను సెప్టెంబర్  నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓఎస్డీ మురళీ దర్శన్, రాకేశ్ రెడ్డి, ఐఐఈడీ కో ఆర్డినేటర్  సుజయ్  పాల్గొన్నారు.