బాటా బ్రాండ్ కక్కుర్తి : 3 రూపాయల బ్యాగుకు..రూ. 9 వేల ఫైన్

బాటా బ్రాండ్ కక్కుర్తి : 3 రూపాయల బ్యాగుకు..రూ. 9 వేల ఫైన్

చండీగఢ్: దినేశ్ ప్రసాద్ బూట్ల కోసం ప్రముఖ బ్రాండ్ బాటా షూస్ స్టోర్ కు వెళ్లాడు. 399 రూపాయలకు షా పింగ్ చేశాడు. కానీ బిల్లు 402 అయింది. అదేంటని అడిగాడు. పేపర్ బ్యాగ్ కాస్ట్ మూడు రూపాయలని సేల్స్ మ్యాన్ చెప్పాడు. బిల్లులోనూ అదే ఉంది. సర్లే అనుకుని పేపర్ కవర్ పై ఓ లుక్కేశాడు. పెద్ద అక్షరాలతో BATA(ప్రచారం కోసం కంపెనీల ట్రిక్కు ) అని రాసుంది. దాంతో ప్రసాద్ కు విపరీతంగా కోపం వచ్చింది. స్టోర్ నుంచి డైరెక్టుగా చండీగఢ్ కన్జ్ యూమర్ ఫోరం(సీసీఎఫ్)కు వెళ్లాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి సీసీఎఫ్ లో కేసు వేశాడు. ఆధారాలుగా పేపర్ బ్ యాగును, బాటా స్టోర్ బిల్లును జత చేశాడు.

ప్రొడక్టు కొంటే దానికి క్యారీ బ్యాగు ఇవ్వడం కస్టమర్ కు ఇచ్చే సర్వీసులో భాగమని తెలిపాడు. బాటా వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని వాపోయాడు. ఈ కేసును పలుమార్లు విచారించిన సీసీఎఫ్ బాటాకు కర్రు కాల్చి వాత పెట్టింది. ప్రసాద్ పిటిష న్ ఖర్చు లు, ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసినందుకు 3 వేల రూపాయలు, స్టేట్ కన్జ్ యూమర్ డిస్పూట్స్​   రిడ్రెస్సల్ కమిషన్ కు లీగల్ ఎయిడ్ కోసం మరో 5 వేల రూపాయలు మొత్తం కలిపి 9 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఆదివారం తీర్పు చెప్పింది. బాటాకు నిజంగా పర్యావరణం గురించి ఆందోళన ఉంటే పేపర్ బ్ యాగులను ఫ్రీగా ఇవ్వాలని సూచించింది. షా పింగ్ చేసే కస్టమర్లకు క్యారీ బ్యాగు ఇవ్వడం కంపెనీల కనీస బాధ్యత అని తెలిపింది. భవిష్యత్ లో  ఇది రిపీట్ కానివ్వొద్దని చెప్పింది.