నిద్రకు ముందు స్నానం మంచిదేనా! తెలుసుకోండి..

నిద్రకు ముందు స్నానం మంచిదేనా! తెలుసుకోండి..

వేసవి కాలంలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేస్తుంటారు. మైండ్ కాస్త రిలీఫ్ అవుతుందని వాళ్ల ఫీలింగ్. అయితే, కాలంతో సంబంధం లేకుండా రోజూ సాయంత్రం ఇంటికి వచ్చాక లేదా నిద్రకు ముందు స్నానం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

మార్నింగ్ బయట తిరగడంతో శరీరంపై చేరిన మురికి, బ్యాక్టీరియా, చర్మం నుంచి విడుదలైన చెమట, జిడ్డు వంటివి స్నానం చేస్తే తొలగిపోతాయి. అందుకే రాత్రి టైంలో స్నానం తప్పక చేయాలి. అంతేకాకుండా తలపై చుండ్రు చేరదు. అందుకే చన్నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే మంచి నిద్ర వస్తుందని డాక్టర్లు సూచించారు.