బతుకమ్మ ఆడితే ఆరోగ్యం కూడా

బతుకమ్మ ఆడితే ఆరోగ్యం కూడా

బతుకమ్మ పండుగ, దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు ఆడి, పాడతారు మహిళలు. బతుకమ్మ ఆటలు, కోలాటాలు, దాండియా, గార్బా నృత్యాలతో సందడి చేస్తారు. అయితే, ఇవి ఆనందానికే కాదు, ఆరోగ్యానికి సాయపడతాయి అంటోంది ఫిట్‌‌నెస్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ సిమ్రాన్‌‌ వాలెచా. వీటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటుంది. 

  • పాట బీట్‌‌కి తగ్గట్టు స్టెప్పులేస్తుంటారు. ఇలా చేయడంవల్ల క్యాలరీలు కరుగుతాయి. ఒక గంటపాటు చేసే డాన్స్‌‌వల్ల 500–600 క్యాలరీలు కరుగుతాయి. డైట్‌‌లో ఏమార్పు లేకున్నా ఈ డాన్స్‌‌ల వల్ల దాదాపు రెండు కిలోల వరకు బరువు తగ్గొచ్చు.
  •   ఈ డాన్స్‌‌లు ఏరోబిక్స్‌‌లా ఉపయోగపడతాయి. వీటివల్ల కండరాల్లో కదలికలు ఏర్పడతాయి. గుండె, ఊపిరితిత్తులు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసలో ఇబ్బందులుంటే పోతాయి.
  •   కోర్‌‌‌‌ మజిల్‌‌ బలంగా తయారవుతుంది. పొత్తి కడుపులోని కొవ్వు కరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వీటివల్ల ఫుల్‌‌ బాడీ వర్కవుట్‌‌ జరిగి శరీరం స్ట్రాంగ్​గా మారుతుంది.
  •   లయ బద్దంగా అందరూ కలిసి ఒకే రకమైన స్టెప్పులేస్తుంటారు. దానివల్ల మైండ్‌‌ ఫోకస్డ్‌‌గా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తులమధ్య కో– ఆర్డినేషన్‌‌ పెరుగుతుంది. 
  • నోట్‌‌: బతుకమ్మ ఆడేటప్పుడు నీళ్లు తాగాలి. మధ్య మధ్యలో బ్రేక్‌‌ తీసుకోవడం తప్పనిసరి.