బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి : ఎర్ర సత్యనారాయణ

బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి : ఎర్ర సత్యనారాయణ
  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్ర సత్యనారాయణ

గద్వాల, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి గ్యారెంటీ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్ర సత్యనారాయణ, మైనార్టీ రాష్ట్ర నాయకుడు హనీఫ్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం గద్వాల టౌన్ లోని పాత బస్టాండ్ లో అఖిలపక్షం బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆర్డినెస్ ద్వారా తెచ్చి కేంద్రానికి పంపినప్పటికీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు. మధుసూదన్ బాబు, నాగర్ దొడ్డి వెంకటరాములు, వాల్మీకి, ఇక్బాల్ పాషా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.