అండర్‌-‑19 క్రికెటర్లకు నజరానా

అండర్‌-‑19  క్రికెటర్లకు నజరానా

న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఐదోసారి అండర్‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్‌‌‌‌ రివార్డు ఇవ్వనుంది. సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు రూ. 25 లక్షల చొప్పున అందజేయనుంది. ఈ హిస్టారికల్‌‌‌‌ విక్టరీ సాధించిన టీమిండియా కుర్రాళ్లను బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ, సెక్రటరీ జై షా ప్రత్యేకంగా అభినందించారు. టీమ్‌‌‌‌.. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఘనంగా సత్కరించేందుకు బోర్డు.. అహ్మదాబాద్‌‌‌‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లండ్‌‌‌‌పై నెగ్గిన తర్వాత టీమ్‌‌‌‌ మొత్తం గయానాలోని ఇండియన్‌‌‌‌  హై కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌‌‌‌కు వెళ్లింది. అక్కడ విక్టరీ సెలబ్రేషన్స్‌‌‌‌ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్స్‌‌‌‌లో అమ్‌‌‌‌స్టెర్‌‌‌‌డామ్‌‌‌‌, బెంగళూరు మీదుగా అహ్మదాబాద్‌‌‌‌కు చేరుకుంటారు. అయితే ప్రస్తుతం విండీస్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌ ఆడుతున్న సీనియర్లతో కుర్రాళ్లు ఇంటరాక్ట్‌‌‌‌ అయ్యే అంశంపై బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఇంగ్లండ్‌‌‌‌ 189 రన్స్‌‌‌‌ చేయగా, తర్వాత ఇండియా 195/6 స్కోరు చేసి నెగ్గింది. ఏపీ క్రికెటర్‌‌‌‌ షేక్‌‌‌‌ రషీద్‌‌‌‌ (50), నిషాంత్‌‌‌‌ సింధు (50 *) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేయగా, రాజ్‌‌‌‌ బవా ఆల్​రౌండ్​ షో చూపెట్టాడు.

ఐసీసీ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా యశ్​ ధూల్‌‌‌‌
నార్త్‌‌‌‌ సౌండ్‌‌‌‌: ఇండియా అండర్‌‌‌‌–19 టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ యశ్​ ధూల్‌‌‌‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్రకటించిన ‘మోస్ట్‌‌‌‌ వాల్యూబుల్‌‌‌‌ టీమ్‌‌‌‌’కూ సారథిగా ఎంపికయ్యాడు. మొత్తం 12 మందితో కూడిన టీమ్‌‌‌‌లో ఇండియా నుంచి రాజ్‌‌‌‌ బవా, వికీ ఒస్త్వాల్​కూ చోటు దక్కింది. హసీబుల్లా ఖాన్‌‌, అవైస్‌‌ అలీ (పాకిస్తాన్‌‌), టియాగు వ్యాలీ (ఆస్ట్రేలియా), దేవ్లాడ్‌‌ బ్రెవిస్‌‌ (సౌతాఫ్రికా), జోష్‌‌ బోయెడెన్‌‌, టామ్‌‌ ప్రీస్ట్‌‌ (ఇంగ్లండ్‌‌), డునమిత్‌‌ వెల్లాగే (శ్రీలంక), రిపన్‌‌ మోండల్‌‌ (బంగ్లాదేశ్‌‌), నూర్‌‌ అహ్మద్‌‌ (అఫ్గానిస్తాన్‌‌) టీమ్‌‌లో ఉన్నారు.