
టీమిండియా క్రికెట్ లో ఎప్పుడూ బిజీగాగానే ఉంటుంది. సెప్టెంబర్ లో జరగబోయే ఆసియా కప్ నుంచి బిజీగా మారనుంది. మూడు ఫార్మాట్ లతో పాటు ఐపీఎల్ ఆడే ప్లేయర్లు బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోవడం సహజం. వీరికి సహజంగానే రెస్ట్ అవసరం. అయితే ఇక నుంచి ప్లేయర్లు రెస్ట్ కావాలనుకుంటే బీసీసీఐ చెప్పినట్టే వినక తప్పదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రెస్ట్ తీసుకుంటే సరిపోదని బీసీసీఐ ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అన్ని ఫార్మాట్ లు ఆడవారిని హెచ్చరించింది.
బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. "చర్చలు జరిగాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లకు, ముఖ్యంగా అన్ని ఫార్మాట్ లు ఆడే రెగ్యులర్ ఆటగాళ్లు ఇకపై భవిష్యత్తులో పని భారం విషయంలో పరిమితులు విధించబడ్డాయి. ఎవరి ఆటగాళ్లు వారి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. పని భారం కారణంగా ఎవరికి ఎప్పుడు రెస్ట్ కావాలో బీసీసీఐ చెబుతుంది. ఫాస్ట్ బౌలర్లకు పని భారం కారణంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సాకుతో కీలక మ్యాచ్ లను మిస్ అయితే బీసీసీఐ అంగీకరించదు". అని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. బుమ్రా లాంటి పేసర్ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. అతన్ని గాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు టెస్టులు ఆడించే సాహసం చేయలేదు. ఇంగ్లండ్ టూర్ లో పని భారాన్ని పరిగణనలోకి తీసుకునే బుమ్రాను మూడు టెస్టులోనే ఆడించామ ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ అన్నాడు. ఈ విషయాన్ని అందరూ గౌరవించాలన్నాడు. బుమ్రా లాంటి ప్లేయరు బెంచ్ కు పరిమితం చేయడం చాలా కఠినమైన నిర్ణయమని చెప్పాడు.