మహిళా క్రికెట్ ఎవరు చూస్తారులే అనుకున్నారా.. : బీసీసీఐకి రూ.377 కోట్ల ఆదాయం

మహిళా క్రికెట్ ఎవరు చూస్తారులే అనుకున్నారా.. : బీసీసీఐకి రూ.377 కోట్ల ఆదాయం

మన దేశంలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ని ఒక మతంలా భావించే అభిమానులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే క్రమంగా బీసీసీఐ మహిళల క్రికెట్ ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లుగానే మహిళల క్రికెట్ కి ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతూ వచ్చింది. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన లాంటి ప్లేయర్లు తమ ఆటతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. 

మహిళల క్రికెట్ ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించారు. మార్చి 4-26, 2023 వరకు ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. తొలి సీజన్ లోనే  రికార్డు స్థాయిలో బీసీసీఐకి 377.49 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను WPL ద్వారా బోర్డు రూ. 377.49 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లుగా సోమవారం వెల్లడించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో BCCI మొత్తం ఆదాయంలో WPL నుండి వచ్చిన మిగులు 6% అని షెలార్ నివేదికలో తెలియజేశాడు

ALSO READ : జుట్టు రాలుతోందా.. అయితే ఈ నూనె ట్రై చేయండి
 
ఈ కాలంలో BCCI ఆదాయంలో 37% ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి, 38% మీడియా హక్కుల విక్రయం ద్వారా వచ్చింది. పురుషుల  అంతర్జాతీయ పర్యటనల నుండి 10% సంపాదించింది. కాగా.. ఇటీవలే క్రికెట్ లో వార్షిక వేతనం పురుషులతో  సమానంగా మహిళలకు ప్రకటిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.