జుట్టు రాలుతోందా.. అయితే ఈ నూనె ట్రై చేయండి

జుట్టు రాలుతోందా.. అయితే ఈ నూనె ట్రై చేయండి

దువ్వెన తలలో పెడితే చాలు ఇన్నేసి వెంట్రుకలు ఊడి చేతిలోకి వచ్చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటున్నారా. అయితే ఈ నూనెని ట్రై చేసి చూడండి. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

  • కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెల్ని ఒక్కో స్పూన్ చొప్పున తీసుకోవాలి. అందులో రెండు విటమిన్ -ఇ టాబ్లెట్లు వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించాలి. తెల్లారి ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి.

    ALSO READ : Good Health : పారా బాయిల్డ్ రైస్ తింటే.. బలమే కాదు.. షుగర్ కూడా పెరగదు

  • వారానికి రెండు మూడు సార్లు ఈ నూనెని వాడాలి.
  • నూనె ఒక్కటి రాసేసి ఊరుకోకుండా పోషకాలతో నిండిన ఫుడ్ కూడా తినాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.