టీమిండియా అనే పేరు వాడుకునే అధికారం బీసీసీఐకి లేదు.. పిటిషనర్ వాదనలపై హైకోర్టు సీరియస్

టీమిండియా అనే పేరు వాడుకునే అధికారం బీసీసీఐకి లేదు.. పిటిషనర్ వాదనలపై హైకోర్టు సీరియస్

టీమిండియా అనే పేరు వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీసీఐ ప్రైవేటు సంస్థ. అలాంటి సంస్థ టీమిండియా అనే పేరు వాడకూడదంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషనర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలు, కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా (BCCI) ఒక ప్రైవేట్ ఎంటిటీ. అలాంటి సంస్థ టీమ్ ఇండియా, ఇండియన్ క్రికెట్ టీమ్ అనే పేర్లు వాడుకునే హక్కు లేదని లాయర్ రీపక్ కన్సల్ పిల్ దాఖలు చేశారు. బీసీసీఐ ప్రైవేటు సంస్థ అయినందున నేషనల్ టీమ్ అని వినియోగించడం తప్పుదారి పట్టించడమేనని ఆయన వాదించారు. ప్రసార భారతి దూరదర్శన్న ప్రసారాలలో టీమ్ ఇండియా అని వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ.. ప్రైవేటు సంస్థ అయిన బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే టీమ్ ను ప్రమోట్ చేయడమేనని పిటిషనర్ వాదించారు.   పిటిషనర్ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావ్ గెడెల తో కూడిన బెంచ్.. పిల్ ను డిస్మిస్ చేసింది. ఇది కోర్టు సమయాన్ని వృధా చేయడమేనని సీరియస్ అయ్యింది. 

టీమ్ భారత్ కు ప్రాతినథ్యం వహించడం లేదని మీరు భావిస్తున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఆడుతూ వస్తున్న టీమ్.. దేశాన్ని రిప్రజెంట్ చేయడం లేదా..? బీసీసీఐ గురించి వదిలేయండి.. ముందు ఒలింపిక్ చార్టర్ గురించి మీకు తెలుసా..? దూరదర్శన్ తదితర సంస్థలు టీమిండియా అని ప్రొజెక్ట్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా.. అది టీమిండియా కాదంటారా..? అని ప్రశ్నించారు. 

►ALSO READ | Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్‌ని టార్గెట్ చేసిన దావూద్ గ్యాంక్.. రూ.5 కోట్లు డిమాండ్..

ప్రసార భారతి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి సంస్థలను నడుపిస్తుంది. అలాంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ.. ప్రైవేటు టీమ్ ను జాతీయ టీమ్ గా వ్యాఖ్యానించడం.. ప్రైవేటు సంస్థను ప్రమోట్ చేయడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. పబ్లిక్ లో ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి.. అనవసర వాణిజ్య ప్రోత్సాహకం కల్పించినట్లేనని వాదించారు. 

బీసీసీఐ తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్- 1975 కింద రిజిస్ట్రేషన్ అయ్యిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం ప్రభుత్వ సంస్థ కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్టీఐ కి ఇచ్చిన సమాధానంలోనూ.. బీసీసీఐ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, లేదా ప్రభుత్వం ఫండింగ్ తో నడిచే సంస్థ కిందికి రాదని తెలిపిన వివరాలను కోర్టు ముందు ఉంచారు. అదే విధంగా RTI యాక్ట్ ప్రకారం.. బీసీసీఐ ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థగా ఎప్పుడూ ప్రకటించుకోలేదని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు.. పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్స్ కాకుండా.. మంచి పిటిషన్స్ తో రావాలని సూచించింది.