Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్‌ని టార్గెట్ చేసిన దావూద్ గ్యాంగ్ .. రూ.5 కోట్లు డిమాండ్..

Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్‌ని టార్గెట్ చేసిన దావూద్  గ్యాంగ్ .. రూ.5 కోట్లు డిమాండ్..

Dawood Ibrahim’s Gang: అనేక సంవత్సరాలుగా సైలెంట్ అయిన దావూద్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులతో బుసలుకొడుతోంది. పాకిస్థాన్ రక్షణలో నీడ పొందుతున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ సభ్యులు భారతదేశంలోని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ భారీగా సొమ్ము డిమాండ్ చేస్తున్న వార్త ప్రస్తుతం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. 

తాజాగా టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ దావూద్ గ్యాంగ్ టార్గెట్లోకి వెళ్లాడు. అతనికి అండర్ వరల్డ్ డాన్ గ్యాంగ్ సభ్యుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం డి-గ్యాంగ్ రింకూకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మూడు సార్లు బెదిరింపు హెచ్చరికలు పంపారని తేలింది. ఇందులో వారు ఆటగాడిని ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ బెదిరింపులు వ్యవహారంలో మెుహమద్ద్ దిల్షాద్, మెుహమద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరు వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తుండగా ఆగస్ట్ 1న భారత అధికారులకు అప్పగించబడ్డారు. గతంలో వీరు జీషాన్ సిద్దిఖీ దివంగత ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ కొడుకు నుంచి కూడా రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. 

►ALSO READ | వరల్డ్ కప్ టీమ్లో ఉండాలంటే ముందు ఆ పని చేయండి.. కోహ్లీ, రోహిత్కు అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత క్రికెట్ టీంలో స్టార్ ఆటగాడిగా ఎదిగిన రింకూ సింగ్ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతను ఉత్తర్ ప్రదేశ్ అలీఘడ్ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల అతను ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం కావటంతో సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాగే ఇటీవల జరిగిన ఆసియా కప్పులో భారత్ విజయతీరాలకు చేరుకోవటానికి అతని ఆట కూడా కీలకంగా మారిన సంగతి తెలిసిందే.