టీమిండియా నుంచి గిల్, సూర్య ఔట్.. వైభవ్ కి రెడ్ కార్పెట్

టీమిండియా నుంచి గిల్, సూర్య ఔట్.. వైభవ్ కి రెడ్ కార్పెట్

Team India: ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత జట్టు పర్యటనలపై పడింది. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్ లతో బిజీబిజీగా గడపనుంది. మొదట స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వేలలో ఇండియన్ టీమ్ పర్యటించనుంది. 

ఈ ఏడాది భారత జట్టుకి అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఏషియన్ గేమ్స్ (Asian Games) ఒకటి.. ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా కొనసాగనున్నాయి. ఈ ప్రతిష్టత్మక ఈవెంట్ కోసం 30 మంది ప్లేయర్స్ తో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రెడీ చేసినట్లు టాక్. లిస్టులో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టెస్టు, వన్డే సారథి శుభ్ మన్ గిల్ కి స్థానం దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. 

ఐపీఎల్ 2026లో దుమ్ములేపిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వైభవ్ తో పాటు జైస్వాల్, శాంసన్, ఇషాన్, అభిషేక్, బుమ్రా, హార్దిక్, శ్రేయస్, నితీశ్, అక్షర్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆడనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ 30 మంది లిస్టు నుంచే 15 మంది సభ్యుల జట్టును సెలక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ ఆసియా క్రీడల కోసం జట్టుని ప్రకటించేందుకు జూన్ 10 చివరి తేదీగా ఫిక్స్ చేసినట్లు టాక్. 

►ALSO READ | ఐపీఎల్ ఫైనల్స్‌లో కింగ్ కోహ్లీ రికార్డు ఇదే.. గుజరాత్‌తో ఫైట్‌కు ముందు విరాట్ హిస్టరీ డీకోడ్!

ఈ టోర్నీ సమయంలోనే టీమిండియా సీనియర్ టీమ్ వెస్టిండీస్ పర్యటనకి వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా ఆతిథ్య విండీస్ తో 5 టీ20లు, 3 వన్డేలని భారత్ ఆడనుంది. సెప్టెంబర్ 27న ఇండియా– విండీస్ పర్యటన స్టార్ట్ అవుతుంది. తొలుత వన్డే సిరీస్ జరిగిన తర్వాత అక్టోబర్ 6 నుంచి టీ20 మ్యాచులు జరుగుతాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఏషియన్ గేమ్స్ ముగించుకుని జట్టుతో చేరే ఛాన్స్ ఉంది.