ఐపీఎల్‌‌‌‌: లాస్ట్‌‌ ఫేజ్‌‌ అంతా ఒకే గ్రౌండ్‌‌లో

ఐపీఎల్‌‌‌‌: లాస్ట్‌‌ ఫేజ్‌‌ అంతా ఒకే గ్రౌండ్‌‌లో

25  రోజుల విండోలో  31 మ్యాచ్‌‌‌‌లు

దుబాయ్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌–14వ సీజన్‌‌‌‌లో మిగిలిన 31 మ్యాచ్‌‌‌‌లను యూఏఈలో విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు మొదలు పెట్టింది. ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ, సెక్రటరీ జై షా తదితరులు ప్రస్తుతం దుబాయ్‌‌‌‌లో ఉండి టోర్నీ లాజిస్టిక్స్‌‌‌‌పై చర్చిస్తున్నారు. అయితే  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లీగ్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలుత 21 రోజుల్లోనే 31 మ్యాచ్‌‌‌‌లను పూర్తి చేయాలని భావించిన బోర్డు.. ఇప్పుడు 25 రోజుల విండో కేటాయించాలని చూస్తోంది.  ఇందులో 8 డబుల్‌‌‌‌ హెడర్స్‌‌‌‌ ఉంటాయని సమాచారం. తొలుత 10 డబుల్‌‌‌‌ హెడర్స్‌‌‌‌ నిర్వహించాలని భావించారు.  అలాగే లీగ్‌‌‌‌ చివరి దశ మ్యాచ్‌‌‌‌లను ఒకే వేదికపై నిర్వహించాలని చూస్తున్నట్టు సమాచారం. లాస్ట్‌‌‌‌ ఇయర్​ మాదిరిగా షార్జా, అబుదాబి, దుబాయ్‌‌‌‌ సిటీల్లోనే ఫేజ్‌‌‌‌–2 జరుగుతుంది. కానీ, ప్లేఆఫ్స్‌‌‌‌, ఫైనల్‌‌‌‌ సహా చివరి దశ మ్యాచ్‌‌‌‌లను దుబాయ్‌‌‌‌ వేదికగా నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను యూఈఏకి ఫిష్ట్‌‌‌‌ చేస్తే.. అక్టోబర్​1వ తేదీ నాటికి  స్టేడియాలను తమకు అప్పగించాలని బీసీసీఐ, ఎమిరేట్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డును ఐసీసీ ఆదేశించే అవకాశం ఉంది. అయితే, మూడు స్టేడియాలలో ఒకదానిలో ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు కొనసాగించేందుకు ఐసీసీ నుంచి బీసీసీఐ అనధికారికంగా పర్మిషన్‌‌‌‌ తెచ్చుకున్నట్టు సమాచారం. ఆ వేదిక దుబాయ్‌‌‌‌ కానుంది.