2027 ODI World Cup: రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. 2027 వరల్డ్ కప్‌కు యంగ్ టీమిండియా

2027 ODI World Cup: రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. 2027 వరల్డ్ కప్‌కు యంగ్ టీమిండియా

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోకో జోడీ వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగడానికి కారణం లేకపోలేదు. సౌతాఫ్రికా వేదికగా 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఆడాలని రోహిత్, కోహ్లీ నిర్ణయించుకున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడడంపై వీరు అనేక సందర్భాల్లో తమ ఆసక్తిని తెలిపారు.  అయితే వీరికి బీసీసీఐ ఊహించని షాక్ ఇవ్వనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే కుర్రాళ్లను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. 

వరల్డ్ కప్ కు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడంతో వారి ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. వీరిద్దరూ ఆ సమయానికి ఫిట్ నెస్ తో పాటు ఫామ్ లో ఉంటారంటే ఖచ్చితంగా చెప్పాలని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ కారణంగానే ఈ ఇద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక్క ఫార్మాట్ ఆడడంతో వీరి ఫామ్ ప్రస్నార్ధకంగా మారింది. బీసీసీఐ కూడా రోహిత్, కోహ్లీ జోడీ ఖచ్చితంగా జట్టులో ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేకపోతుంది. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకపోయినా ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా అద్భుతంగా ఆడి 2-2 తో సమం చేసుకుంది.

రోహిత్ శర్మను తప్పించి గిల్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రోహిత్ వయసు 38 కాగా కోహ్లీ వయసు 36. ఈ ఇద్దరూ తిరిగి జట్టులోకి రావడం ఖాయం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతారు. ఆ తర్వాత నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఆడతారు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ కు మాత్రం వీరు ఆడడం అనిశ్చితిగానే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ ఓటమి భారత జట్టుకు బిగ్ హార్ట్ బ్రేక్ అనే చెప్పాలి.