World Cup 2023: క్రికెడ్ అభిమానులకు గుడ్న్యూస్.. అమ్మకానికి మరో 4 లక్షల టిక్కెట్లు

World Cup 2023: క్రికెడ్ అభిమానులకు గుడ్న్యూస్.. అమ్మకానికి మరో 4 లక్షల టిక్కెట్లు

క్రికెట్ వరల్డ్ కప్ 2023 టిక్కెట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో తదుపరి దశలో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సంఘాలతో చర్చల తర్వాత BCCI ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నమెంట్ కోసం సుమారు 4లక్షల టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 

"ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 అన్ని మ్యాచ్‌ల టిక్కెట్లను 2023 సెప్టెంబర్ 8 రాత్రి 8:00 నుంచి అమ్మకం ప్రారంభం అవుతుందని బీసీసీఐ ప్రకటించింది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా  టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.