బీసీల వాటా కూడా అగ్రవర్ణాలకే ఇస్తారా? : ఎంపీ ఆర్‌‌‌‌‌‌‌‌ .కృష్ణయ్య

బీసీల వాటా కూడా అగ్రవర్ణాలకే ఇస్తారా? : ఎంపీ ఆర్‌‌‌‌‌‌‌‌ .కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు : దేశంలో 75 సంవత్సరాలుగా బీసీలను అవమానిస్తూ బీసీల వాటా కూడా అగ్రవర్ణాలకే ఇస్తూ కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం విద్యానగర్  బీసీభవన్‌‌‌‌లో తెలంగాణ  బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య అధ్యక్షతన  వివిధ బీసీ సంఘాలు, మహిళా సంఘాల సమావేశం జరిగింది.  

సమావేశానికి హాజరైన ఆర్. కృష్ణయ్య ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొంగ కరుణశ్రీని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు.

బీసీల సమస్యలు పరిష్కరించి కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ  నెల 5, 6 న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘాల నాయకులు రాజేందర్, నీల వెంకటేశ్‌‌‌‌, నిరంజన్‌‌‌‌, బాలయ్య, నిఖిల్‌‌‌‌, రేణుక లావణ్య తదితరులు పాల్గొన్నారు.