మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేస్తం : బూర నర్సయ్య గౌడ్

మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేస్తం : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో  బీసీల సంక్షేమమే లక్ష్యంగా డ్రాఫ్ట్ ను తయారు చేసి పార్టీ అధిష్టానానికి, మేనిఫెస్టో కమిటీకి అందజేస్తామని బీజేపీ బీసీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.  శనివారం ఆయన అధ్యక్షతన పార్టీ స్టేట్ ఆఫీసులో సమావేశం జరిగింది. మీటింగ్ లో కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, పన్నాల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు ఆలె భాస్కర్, దాసరి మల్లేశం, హరిశంకర్  పాల్గొన్నారు. 

అనంతరం బూర నర్సయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశ్వకర్మ యోజనను ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా రూ.13వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల బడ్జెట్ తో బడుగు, బలహీన వర్గాలకు చెందిన18 సాంప్రదాయక వృత్తులను ప్రోత్సాహించేందుకు పనిముట్లను అందిస్తున్నామన్నారు.  

నైపుణ్య శిక్షణకు అవసరమైన ఆధునిక పనిముట్లు, యంత్రాలు, వాటి పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల వరకు ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు జరిగే ఈ స్కీమ్​ గురించి ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సముచిత స్థానం ఉంటుందన్నారు.