వరద బాధితులకు తక్షణమే సాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు లేదా ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు అందచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులు సహాయక శిబిరాల నుంచి వెళ్లేముందు ఈ సాయం అందజేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కంది పప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ముంపు గ్రామాల వారికి అందుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారి నియమించాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, అందించాలన్న సీఎం. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలన్న సీఎం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 16, 2022
గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం సమీక్ష. ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం. తాజా పరిస్థితిపై ఆరా. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం. #godavarifloods
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 16, 2022
