చెల్లిని కడుపున మోసింది!

చెల్లిని కడుపున మోసింది!

అమ్మ కడుపులో ఆ ఇద్దరు పడ్డారు. కానీ,అక్క పిండం ఎదిగినంత వేగంగా చెల్లి పిండం ఎదగలేదు. ఫలితంగా ఆ చెల్లి.. అక్కకడుపులోకి వెళ్లిపోయింది. అక్క శ్వాసనే తానూ తీసుకుంది. అయినా ఆ చెల్లి దక్కలేదు.కారణం, కాళ్లూ చేతులు, శరీరం ఎదిగినా.. గుండె, మెదడు రాలేదు. దీంతో ఆ పాప పుట్టాక.. తన కడుపులోనే ఉన్న తోబుట్టువును డాక్టర్లు తీసేశా రు. దీనినే ఫీటస్ ఇన్ ఫీటూ అని డాక్టర్లు అంటున్నా రు. అంటే కవల పిండాల్లో ఓ పిండం సరిగ్గా ఎదగక.. ఇంకో పిండంలోకి చేరడమన్నమాట. అత్యంత అరుదుగా ప్రతి ఐదు లక్షలకు ఒకరు ఇలా పుడుతుంటారట. తొలిసారి 1808లో అలాంటి ఘటన జరిగింది. తాజాగా కొలంబియాలోని బరాంఖిలాలో ఫిబ్రవరి 22న మోనికా వెగా అనే తల్లికి అలాంటి ఘటనే ఎదురైంది. తోబుట్టువును కడుపులో మోస్తూ పుట్టిన ఆ పాప పేరు ఇట్జా మర.నిజానికి మామూలు పిండాల్లాగే ఆ కవల పిండాలున్నాయి. కానీ , మొదటి పిండం ఎదిగినంత వేగంగా రెండో పిండం ఎదగలేదు. దీంతో మొదటి పిండంలో ఆ రెం డో పిండం కలిసిపోయిందని చెబుతున్నా రు డాక్టర్లు . తొలుత పాప కాలేయంపై ఉన్న ఆ పిండాన్ని చూసి నీటి బుడగ/కణితి అనుకున్నా మని అంటున్నా రు. త్రీడీ /4డీ అల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ టెక్నిక్ ద్వా రా చూస్తే ఆ పాప పొట్టలో కణితి అనుకున్న దానికి రక్తనాళాలు కనిపించాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణానికే ప్రమాదమని, ఇతర అవయవాలు దెబ్బతినే ముప్పుందని భావించిన డాక్టర్లు 37వ వారంలోనే మోనికా కు లా మెర్స్​డ్ ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. పుట్టాక కొన్ని రోజులకు ఇట్జా మర కడుపుకు చిన్న రంధ్రం చేసి ఎదగని తన చెల్లి పిండాన్ని తీసేశారు. ఆ పిండం 14 గ్రాముల బరువు, 45 మిల్లీమీటర్లు పొడవు ఉందంతే. ఎదగని పిండం బొడ్డుపేగును కత్తిరించగానే ఊపిరి ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు. నెల వయసున్న ఇట్జా మర ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది.