అందమైన అమ్మాయిలు సినిమాలే చేయాలా?.. బిగ్ బీ మనవరాలి సూపర్ రిప్లయ్ 

V6 Velugu Posted on Jul 29, 2021

ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ఆయన భార్య జయా బచ్చన్‌ కూడా నటే కావడం గమనార్హం. కుమారుడు అభిషేక్ బచ్చన్ పలు సినిమాలతో తన సత్తా చాటాడు. మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇక అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఐష్ అందం, అభినయం, డ్యాన్స్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బీ ఫ్యామిలీలో ఇంత మంది నటులున్నా ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారా అని అందరూ ఆసక్తి చూస్తున్నారు. ముఖ్యంగా అమితాబ్ మనవరాలు నవ్యా నవేలీ నందా బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. 

అందమైన రూపం, ఆకట్టుకునే లుక్స్‌, పొడగరి అయిన నవ్యా నవేలీ హిందీ సినిమాల్లో రాణిస్తుందని బిగ్ బీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదే విషయంపై ఓ ఫ్యాన్ నవ్యా నందాను ఓ ప్రశ్న అడిగాడు. ‘మీరు ఇంత అందంగా ఉన్నారు. బాలీవుడ్‌లో ప్రయత్నించొచ్చు కదా’ అని అభిమాని నవ్యా నవేలీని క్వశ్చన్ చేశాడు. దీనికి ఆమె తనదైన శైలిలో సూపర్ రిప్లయ్ ఇచ్చారు. ‘మీ మాటలకు ధన్యవాదాలు. కానీ అందమైన మహిళలు బిజినెస్ కూడా రన్ చేయొచ్చు కదా’ అని నవ్వ బదులిచ్చారు. దీన్ని బట్టి నవ్యాకు వ్యాపారం మీద చాలా ఆసక్తి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఫ్యామిలీ బిజినెస్‌ వ్యవహారాలు చూసుకోవడంపై ఆమె దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్‌హమ్ యూనివర్సిటీలో డిజిటల్ టెక్నాలజీ, యూఎక్స్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన నవ్యా నవేలి.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

 

Tagged Bollywood, acting, Navya Naveli Nanda, Amithab Bachchan Granddaughter, Enterpreneur

Latest Videos

Subscribe Now

More News