స్టెరాయిడ్స్ తీసుకున్నా.. అందుకే నా ముఖం ఇలా అయింది : సమంత

స్టెరాయిడ్స్ తీసుకున్నా.. అందుకే నా ముఖం ఇలా అయింది : సమంత

కొంత కాలంగా మాయో సైటిస్(Myositis) వ్యాధితో బాధపడుతున్న సమంత(Samantha) సినిమాలకు బ్రేక్ ఇచ్చి పలు డిఫరెంట్ ట్రిప్స్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా ట్రీట్ మెంట్ పూర్తీ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన సమంత ఇన్ స్టా వేదికగా ఫ్యాన్స్తో క్రేజీ ఇంటరాక్షన్లో పాల్గొంది. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇంటరాక్షన్ వైరల్ అవుతుంది. 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీరు..మీ యొక్క చర్మ కాంతి రహస్యం ఏంటని ఒక అభిమాని ప్రశ్న వేయగా..దీనికి సమంత స్పందిస్తూ..మీరు అనుకుంటున్నట్లుగా అటువంటిది ఏమి లేదు. మాయో సైటిస్ ట్రీట్మెంట్ లో చాలా స్టెరాయిడ్స్ తీసుకున్న. తర్వాత చర్మ సంబంధిత సమస్యలతో మళ్ళీ ఇబ్బంది పడ్డాను. అందుకు విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన సింగర్ చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానని భరోసా ఇచ్చింది. అంటూ సమంత తన చర్మ వ్యాధి సమస్యను వివరించింది. అలాగే ప్రస్తుతానికి తన ముందు ఎలాంటి ప్రణాళికలు లేవని, నాకు సెట్ అయ్యే స్టోరీస్ ను మాత్రమే వింటూ సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిపింది. 

ప్రసెంట్ సమంత డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడెల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్ కు స్ఫూర్తిగా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ తో చేసిన ఖుషి మూవీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. త్వరలో సమంత మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.