బెదురులంక 2012 నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్‌

బెదురులంక 2012 నుంచి హీరోయిన్  ఫస్ట్ లుక్ రిలీజ్‌

ఆర్‌‌ఎక్స్‌100 ఫేమ్‌ కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం బెదురులంక 2012. నేహా శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది. ఇందులో నేహా సంప్రదాయ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. పైకి సైలెంట్‌గా కనిపిస్తూ, లోపల ఆర్డీఎక్స్ బాంబ్‌లాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయిలా చిత్ర పాత్రలో నేహాశెట్టి  అందరినీ ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ తెలిపింది.

పల్లెటూరు, మానవ భావోద్వేగాలు, డ్రామా, కామెడీ జానర్‌‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ (రవీంద్ర బెనర్జీ ముప్పానేని) నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.