రైలులో తరలిస్తున్న గోమాంసం పట్టివేత

రైలులో తరలిస్తున్న గోమాంసం పట్టివేత

నల్గొండ అర్బన్, వెలుగు: రైలులో తరలిస్తున్న గోమాంసాన్ని శనివారం రాత్రి నల్గొండ రైల్వేస్టేషన్‌‌‌‌లో సివిల్‌‌‌‌, రైల్వే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేపల పేరుతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌‌‌‌కు జన్మభూమి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో గోమాంసం తరలిస్తున్నారని బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, వీహెచ్‌‌‌‌పీ, హిందూ సంఘాల నేతలకు సమాచారం అందింది. దీంతో రైలును ఆపేందుకు రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. 

వెంటనే నల్గొండ జీఆర్‌‌‌‌పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్‌‌‌‌పీ పోలీసులతో పాటు నల్గొండ ఏఎస్పీ రాములునాయక్‌‌‌‌, డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో సివిల్‌‌‌‌ పోలీసులు నల్గొండ రైల్వే స్టేషన్‌‌‌‌లో రాత్రి సుమారు 12.30 గంటలకు జన్మభూమి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ను ఆపి తనిఖీ చేశారు. రైలు ముందున్న లగేజీ బోగీలో 40 బాక్స్‌‌‌‌లు, వెనుకాల ఉన్న లగేజీ బోగీలో మరో 40 బాక్స్‌‌‌‌లను గుర్తించారు. 

వీటిని రైలు నుంచి కిందకు దించి చూడగా బాక్స్‌‌‌‌లలో చేపలు ఉన్నట్లు లేబుల్‌‌‌‌ కనిపించడంతో వాటిని ఓపెన్‌‌‌‌ చేయగా గోమాంసం కనిపించింది. ఒక్కో బాక్స్‌‌‌‌లో 30 కేజీల నుంచి 40 కేజీల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. లేబుల్‌‌‌‌పై కేవలం పద్మ అనే పేరు మాత్రమే ఉండగా, మిగతా వివరాలన్నీ బార్‌‌‌‌కోడ్‌‌‌‌ విధానంలో కనిపించాయి. దీంతో ఈ పార్సిల్స్‌‌‌‌ బుక్ చేసిన వారి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మాంసం శాంపిల్స్‌‌‌‌ను సేకరించి 
టెస్టింగ్‌‌‌‌కు పంపించారు.