మద్యం సేవించడానికి కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు తెలియని నిజం ఇదే..

మద్యం సేవించడానికి  కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు  తెలియని నిజం ఇదే..

చాలా  మంది మద్యం తాగే ముందు గ్లాస్ లో వేలు ముంచి 2 నుంచి -3 చుక్కలు గాల్లో చిమ్ముతారు. లేదంటే 3-నుంచి 4 డ్రాప్స్ నేలపై పోస్తారు. ఇదేంటని ఎవరైనా అడిగితే మందు బాబులు ఇదో ఆచారం అంటారు కొందరు. మరికొందరైతే ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని నాలుగు చుక్కలు నేలపై పోస్తామంటారు. అయితే పూర్వ కాలంలో అంటే బ్రిటీష్​ వాళ్లు డ్రింక్​ చేసేటప్పుడు  ఇలానే చేసేవారని కొన్ని నివేదికల్లో కూడా చెబుతున్నారు.  అసలు ఈ ఆచారం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.  . . . 

మద్యం సేవించే ముందు చాలామంది గ్లాసులో వేలు ముంచి రెండు నుంచి మూడు చుక్కలు గాల్లోకి చిమ్ముతారు. లేదంటే మూడు నుంచి నాలుగు చుక్కలు నేలపై పోస్తారు. ఎప్పటినుంచో వస్తున్న ఆచారమని చెబుతారు.మరికొందరేమో దిష్టి తగలకుండా ఉండాలని అలా నేలపై వేస్తున్నట్లు చెబుతారు. గతంలో మద్యం ప్రియులు ఇంట్లో తయారుచేసిన మద్యం (రూడీ మార్క) తాగేవారు. ఆల్కహాల్ కెపాసిటీని చెక్ చేయడానికి గ్లాస్ లోని మందును నేలపై రెండు చుక్కలను వేసేవారు. మట్టి బుడగలు ఏర్పడటం ప్రారంభిస్తే మద్యం స్ట్రాంగ్‌గా ఉందో లేదో చెక్ చేసుకునేవారు. బుడగలు తగ్గినట్లయితే అప్పుడు మద్యం పెద్దగా కిక్ ఇవ్వదని డిసైడ్ అయ్యేవారు. గ్రామీణ ప్రజల డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (ప్రయోగశాల) లో ఇదో రకం. అంతే కాని దీనిపై సంప్రదాయం, ఆచారం లేదంటున్నారు. ప్రతి పాత విషయానికి కొంత అర్థం ఉంటుంది. మనకు తెలియకుండానే వాటిని అలా చేయడం మొదలుపెడతాం.

పూర్వకాలంలో మహారాజులు, రాజులు ఎవరి ఇంటికి వెళ్లినా తినేవారు కాదని, తాగేవారు కాదని, ఏదైనా విష ప్రయోగం జరుగుతుందనే ప్రమాదంతో ఇలా చేసేవారు. తమ వేళ్లకు ఉంగరాలను ధరించేవారు. అవి వివిధ లోహాలతో తయారుచేసినవై ఉండేవి. బంగారం-వెండి, నీలమణితో పాటు మరెన్నో లోహాలు ఉండేవి. మద్యంలో వేలును ముంచి కళ్లలోని రత్నాలపై ఒక చుక్క లేదా రెండు ఆల్కహాల్ వేసి రసాయనిక చర్య జరగకుండా చూసేవారు. మద్యంలో వేలును ముంచి ఒక చుక్క లేదా రెండు ఆల్కహాల్ వేసి రసాయనిక చర్య జరగకుండా చూస్తారు.

మందు తాగే ముందు మూడు నుంచి నాలుగు చుక్కలు నేలపై పోయడానికి ప్రధాన కారణం ఇదేనని భావిస్తారు. బాగా నిద్ర పోవడానికి, ప్రశాంతతకు, ప్రయాణ ఒత్తిడిని దూరం చేసేందుకు ఉపశమనం కోసం మందు సేవిస్తారు.ప్రయాణాలవల్ల వచ్చే బడలిక లాంటి ప్రభావాలను తగ్గించడానికి మద్యం మంచి ప్రయోజనకరమైన ఔషధంగా అప్పట్లో భావించేవారు.ప్రయాణికులతోపాటు క్రీడాకారులుకూడా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా మద్యం సేవిస్తారు. అలా తీసుకోకపోతే వారు తమ పనిని కొనసాగించలేరు.  ఇప్పటి కూడా కొంతమందికి మందు చుక్క పడకపోతే వారు చేయాల్సిన పనిని సరిగా చేయలేకపోతున్నారు.  అంటే మందుబాబులకు మద్యం ఒక టానిక్​ లాగా పని చేస్తుందన్నమాట.