బెల్లంపల్లి తిలక్ వాకర్స్వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 నిరుపేద జంటలకు కల్యాణం

బెల్లంపల్లి  తిలక్ వాకర్స్వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20  నిరుపేద జంటలకు కల్యాణం
  • బెల్లంపల్లి  తిలక్​ వాకర్స్​వెల్ఫేర్​ అసోసియేషన్ ఘనత

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని తిలక్​వాకర్స్​వెల్ఫేర్​అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శివాలయంలో 20 నిరుపేద జంటలకు సామూహికంగా పెళ్లిళ్లు జరిపించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద జంటలకు ఉచితంగా పుస్తెలు, మట్టెలు, నూతన వస్ర్తాలు,  బిందె, గోడ గడియారం, బ్యాగ్​, రైస్​కుక్కర్​, ఇతర సామాగ్రిని దాతల సాయంతో ఉచితంగా అందించారు. 

20 జంటలకు సంబంధించిన కుటుంబాలకు, బంధువులకు ఉచితంగా భోజనాలు సమకూర్చారు. ఈ వేడుకలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్​మాట్లాడుతూ..  తిలక్​వాకర్స్​అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఇలాంటి వాటికి తన వంతు సాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కె. రాంచందర్, నాయకులు నాతరి స్వామి, తిలక్​వాకర్స్​వెల్ఫేర్​అసోసియేషన్ అధ్యక్షుడు రత్నంరాజం, ప్రధాన కార్యదర్శి కంటెవాడ నగేశ్ కుమార్, సభ్యులు రంగరామన్న, జి.జయరాం, జి.వేణుగోపాల్​, రాజ్​కుమార్​, వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. 

నిరుపేదలకు సాయం చేయడంలో ఎంతో తృప్తి 

నిరుపేదలకు సాయం చేయాలన్నదే తమ ఆశయం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన సంఘం సామూహిక వివాహాలు చేయాలని సంకల్పించి విజయం సాధించాం. ఇందుకు వ్యాపారులు, ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, తమ సంఘం సభ్యులు ఎంతో సహకరించారు.  రత్నంరాజం, అధ్యక్షుడు, తిలక్​వాకర్స్​అసోసియేషన్