ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లకు మూడేళ్లు జైలు

ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లకు మూడేళ్లు జైలు

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ స్పెషల్​కోర్టు తీర్పు ఇచ్చింది. ఏసీబీ సీఐ వెంకటరాజాగౌడ్ వివరాల ప్రకారం.. ​గజ్వేల్ ​టౌన్​కు చెందిన వ్యక్తికి జగదేవ్​పూర్​ మండలం ఇటిక్యాల గ్రామంలో 24 ఎకరాల భూమి ఉంది. దాని మీద బ్యాంక్​ లోన్​ తీసుకునేందుకు ల్యాండ్​ వాల్యూవేషన్​ సర్టిఫికెట్​ కావాలని పొలం యజమాని 2008లో జగదేవ్​పూర్​ తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు.

అప్పటి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​పి.హనుమంతరావు, ఇటిక్యాల వీఆర్ఓ వెంకటనర్సింహారెడ్డి.. సర్టిఫికెట్​ఇవ్వాలంటే రూ.7వేలు లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పొలం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్​ కోర్టులో కేసు విచారణ కొనసాగింది. నేరం రుజువైనట్లు తేలడంతో జడ్జి సాంబశివరావు బుధవారం ఇద్దరికి రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.2వేలు ఫైన్ ​వేశారు. ఇదే కేసులో మరో సెక్షన్​కింద ఇద్దరికీ ఏడాది జైలు, వెయ్యి రూపాయల ఫైన్​ విధించారు.