IPL2023 : ఐపీఎల్ చివకి మ్యాచులు ఆడను.. జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇస్తా

IPL2023 : ఐపీఎల్ చివకి మ్యాచులు ఆడను.. జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇస్తా

ఐపీఎల్ మొదలవక ముందే చెన్నె సూపర్ కింగ్స్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇదివరకే గాయం కారణంగా పేసర్ జేమీసన్ సీజన్ మొత్తానికి దూరంగా కాగా, ఇప్పుడు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చివరి దశ మ్యాచులకు దూరం అవుతున్నాట్లు తెలిపాడు. ఐపీఎల్ ఫైనల్ మే28 నుంచి జరగనుంది. ఇంగ్లండ్ కు జూన్ 1 నుంచి ఐర్లాండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తర్వాత జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ మొదలవుతుంది. బెన్ స్టోక్స్ వీటిలో ఆడాలంటే  ప్రాక్టీస్ కోసం ప్లేఆఫ్స్ కు దూరంకావాల్సి ఉంటుంది.

‘సీఎస్ కే ప్లేఆఫ్స్ చేరినా ఐపీఎల్ ను వీడతా. ఇలాంటి సమయంలో ఐపీఎల్ కంటే దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఈ విషయం గురించి మిగతా టీంమేట్స్ తో చర్చించాలి. టెస్టు సిరీస్ కోసం తగినంత సమయం కేటాయించాలనే ఈ నిర్ణయం తీసుకున్నా’నని స్టోక్స్ తెలిపాడు. కాగా అతడిని చెన్నై రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది.