మెక్‌కలమ్ రికార్డు బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్

మెక్‌కలమ్ రికార్డు బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మౌంట్ మౌన్‌గనుయ్‌లో జరుగుతున్న  తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు సిక్సులు బాది స్టోక్స్ ఈ రికార్డును అందుకున్నాడు. స్టోక్స్ 90 మ్యాచ్ లో 108 సిక్సులు బాదాడు. అయితే అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ పేరు మీద ఉండేది.  మెక్‌కలమ్101 మ్యాచ్ లో 107 సిక్సులు కొట్టాడు. ఆ తరువాత ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ (100), కల్లీస్(97) ఉన్నారు. ఇక టాప్ 10 లో భారత్‌ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91) ఒక్కడే ఉన్నాడు. ఇక కివీస్, ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానిరకి వస్తే మూడో రోజు ఆట ముగిసే టైమ్ కు కివీస్ 63 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంకా  331 పరుగులు చేయాల్సి ఉంది.