
టీమిండియాతో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 20 నుంచి జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కు మద్యాన్ని మానేసినట్టు స్టోక్స్ వెల్లడించాడు. ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు తాను తిరిగి మద్యం సేవించే ఆలోచన లేదని ఆల్ రౌండర్ తెలిపాడు. సిరీస్ కు ఫిట్ గా ఉండడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టోక్స్ తెలిపాడు. జిమ్‌లో, గ్రౌండ్ లో తాను కష్టపడి పని పనిచేయాలని ఇండియాతో సిరీస్ కు సరిగ్గా నెల ముందు తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.
"నేను మద్యాన్ని సేవించడం ద్వారా నాకు గాయం పెద్దది అవ్వడం గమనించాను. అప్పటి ఉంచి నేను మారాలనుకున్నాను. జనవరి 2 నుంచి నేను మద్యాన్ని తాగడం లేదు. గాయం నుంచి కోలుకునే వరకు మాత్రమే కాదు. క్రికెట్ కెరీర్ లో ఫిట్ గా ఉందేందుకు ఇకపై మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నాను". అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. పరిమిత ఓవర్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్రస్తుతం టెస్టుల్లో సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలంటే స్టోక్స్ పూర్తి ఫిట్ నెస్ ఉండడం చాలా కీలకం.
ALSO READ | Italian Open: మట్టిపై మరో స్పెయిన్ యోధుడు.. రోమ్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది.
Ben Stokes gives up alcohol addiction to save career
— SportsTiger (@The_SportsTiger) May 19, 2025
📷: ECB#benstokes #testcricket pic.twitter.com/RVQ9FO5dJY